వాస్తు శాస్త్ర విజ్ఞానం మానవ జీవిత అభివృద్ధికి సోపానం

వాస్తు శాస్త్ర విజ్ఞానం

ఈ భూమిపై జన్మించిన ప్రతి మానవుడి చిరకాల కోరిక తాను ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలని, దానికోసం అతను తన కష్టార్జితం నుండి ప్రతిసారి కొంత డబ్బును తీసి పక్కన దాచటం జరుగుతుంది. ఇలా కొద్ది కొద్దిగా దాచినటువంటి ధనం పెద్ద మొత్తంలో చేకూరిన తర్వాత తన యొక్క సొంత ఇంటి నిర్మాణం కొరకు ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే వారు నివసించే ఇల్లు అన్ని విధాల ఆయురారోగ్యా ఐశ్వర్య వంశాభివృద్ధి తో ఉండాలని, వారికి అందుబాటులో ఉన్నటువంటి వాస్తు పండితులను కలిసి ఇంటి యొక్క నిర్మాణపు ప్లాన్ గించుకుంని ఆ ప్లాన్ ఆధారంగా నే తన ఇంటిని నిర్మించుకోవడం చేపడుతున్నారు. అలాగే నేటి ఆధునిక యుగంలో అసలు వాస్తు అంటే ఏమిటి వాస్తు లేదు ఏమీ లేదు అన వారు ఉన్నారు, కానీ ఈ ఆధునిక యుగానికి సంబంధించి కొన్ని కొత్త రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ కొంతమంది సిద్ధాంతకర్తలు నేటి ఆధునిక భవనాలకు కూడా అనాదిగా ఆచరిస్తున్న పద్ధతులనే అనుసరిస్తున్నారు. కానీ దేశ కాలమాన పద్ధతుల ప్రకారం నేటి ఆధునిక కట్టడాలలో వాస్తు రీత్యా అనేకరకాల మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు : నేను ఇక్కడ ఒక విషయం చర్చిస్తాను, గతంలో వాస్తు శాస్త్రం పుట్టినప్పుడు, ప్రజలను పరిపాలించే రాజులతో పాటు వ్యాపార వాణిజ్యాలు చేసే కొంతమంది ధనవంతులు ఉండేవారు. వారు తమ స్థోమతకు తగ్గట్టుగా కోటలు, భవనాలు నిర్మించుకునేవారని అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజుల్లో, మలవిసర్జన చేయడానికి నివాస గృహాలకు దూరంగా కొన్ని ప్రత్యేక భవనాలు ఉండేవి మరియు వారందరూ ఆ భవనాలలోనే మలవిసర్జన చేసేవారు. కానీ ఆ రోజుల్లో సెప్టిక్ ట్యాంకులు లేవు, కాబట్టి వారి మలాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక తెగకు చెందిన వారు ఉండేవారు. అందువల్ల, వాస్తు శాస్త్రం పుట్టినప్పుడు, మలాన్ని నిల్వ చేయడానికి సెప్టిక్ ట్యాంకులను ఎక్కడ పెట్టాలో వాస్తు శాస్త్రంలో స్పష్టంగా వ్రాయబడలేదు. మరి నేటి ఆధునిక యుగంలో, ఇళ్లలో అటాచ్డ్ టాయిలెట్లు నిర్మిస్తున్నారు. అది కాకుండా, కొంతమంది ప్లానర్లు తమ టాయిలెట్ల నుండి వచ్చే వ్యర్థాలను నిల్వ చేసే సెప్టిక్ ట్యాంక్‌ను ఆగ్నేయంలో, మరికొందరు పశ్చిమంలో, మరికొందరు ఉత్తరంలో, ఇంకొందరు తూర్పు లేదా ఈశాన్యంలో నిర్మించవచ్చని చెబుతున్నారు. అలాగే కొంతమంది ప్లానర్లు ఇంటి బయటి స్థలం ఖాళీగా ఉంటే అది దక్షిణం, లేదా నైరుతి, అయినా సరే అది మీ ఇంటి ప్రాంగణం బయటకి వెళుతుంది కాబట్టి, మీరు అక్కడ కూడా నిర్మించుకోవచ్చని చెబుతున్నారు. నా అనుభవంలో అలాంటి తప్పులు చేసిన ఇళ్లను, అపార్ట్‌మెంట్లను నేను చాలానే చూశాను. అపార్ట్‌మెంట్ స్తంభాలపై ఆధారపడి ఉంటుంది మరియు పార్కింగ్ కోసం బేస్‌మెంట్లు ఖాళీగా ఉంటాయి, కావున ఈ దోషాలు మీకు వర్తించమని చెప్పారని అనేకచోట్ల యజమానులు నాకు చెప్పడం జరిగింది. ఒకరికి ఇల్లు కట్టుకోవడానికి వాస్తు రీత్యా ఇంటి ప్లాన్ ఇచ్చే ముందు, ఆ ప్లాన్ ఇచ్చే పండితులకు అసలు వాస్తు అంటే ఏమిటో పూర్తిగా తెలిసి ఉండాలి. వాస్తు తెలుసుకోవడం అంటే అందుబాటులో ఉన్న పుస్తకాలను యూట్యూబ్ల ద్వారా నేర్చుకొనే విద్య కాదు వాస్తు శాస్త్రం అనేది ప్రకృతి ద్వారా వచ్చే ఫలితాలను ఇచ్చే సమగ్ర శాస్త్రం. శాస్త్రం అంటే కంటికి కనిపించే సత్యాలు. శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ఏదైనా పొరపాటు జరిగితే, దానివల్ల కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగే ఇల్లు కట్టే విషయంలో వాస్తుకు సంబంధించి ఏదైనా పొరపాటు జరిగితే దాని యొక్క పర్యావసనాలు కూడా ఆ ఇంటిలో నివసించేటువంటి వ్యక్తులపై తీవ్రంగా ఉంటాయి. కనుక వాస్తు విద్యని అభ్యసించాలి అన్న అభిలాష ఉన్నవారు ఎవరైనా అనుభవిద్యులైన గురువు వద్దకు వెళ్లి వారు ఇచ్చేటువంటి ఇంటి ప్లాన్ విధివిధానాలను అనుసరిస్తూ ఒకవేళ ఏదైనా సందర్భంలో వారు ఇచ్చే ప్లాన్ లో కని లేక మీరు సందర్శిస్తున్నటువంటి ఇంటికి సంబంధించి ఇంతకుముందు ఉన్న లోపాలను కని ఎందుకంటే, ప్రపంచంలో ఎవరూ కూడా 100% కచ్చితమైన వాస్తును ఇవ్వలేరు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.కనుక పొరపాట్లు ఉంటే వాటిని గ్రహించి ఎలా సరి చేయాలి అన్న మెలకువలు అన్నీ తెలుసుకుని ఉన్న వాళ్లు మాత్రమే వేరే వాళ్ళకి ఇంటికి సంబంధించిన ప్లాన్లను ఇవ్వటానికి అర్హులవుతారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ ఇంటి యజమాని బయట అనేక సమస్యలతో ఇంటికి వచ్చినా, అతని ఇంట్లో వాస్తు దోషం వల అతనికి ప్రశాంతమైన నిద్ర పట్టదు మరియు సమస్యలను పదే పదే గుర్తు చేసుకుని అనారోగ్యానికి గురవుతాడు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఎందరు ఎన్ని రకాలుగా సంపాదించి తీసుకువచ్చిన డబ్బుని ఇంట్లో ఉంచిన ఏదో ఒక కారణంగా ఆ డబ్బు ఖర్చు అయి చివరికి వారికి అప్పులు మిగులుతుంది. అలాగే మంచి వాస్తుతో నిర్మించిన ఇంట్లో ఉంచిన డబ్బు ఇతర అవసరాల కోసం త్వరగా ఖర్చు కాదు. మరియు అవసరాలను తీర్చడానికి, ఆ అవసరాలకు సరిపడా లేదా అంతకంటే ఎక్కువ డబ్బు ఏదో ఒక రూపంలో ఆ ఇంటికి సమకూరతుంది. అందువల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైన రెండు ముఖ్యమైన విషయాలు, మొదటిది ఆరోగ్యం మరియు రెండవది డబ్బు. ఆరోగ్యంగా ఉండటానికి ముందు, ఒక వ్యక్తికి ప్రశాంతమైన నిద్ర అవసరం. అప్పుడు ఆ వ్యక్తి నిద్రలేచినప్పుడు, కొత్త ఆలోచనల రూపంలో సమస్యలకు కొత్త పరిష్కారాలు లభిస్తాయి. అలాగే అతను సంపాదించిన డబ్బును ఇంటికి తీసుకువచ్చి పొదుపు చేస్తే, ఆ డబ్బు అనవసరమైన అవసరాల కోసం ఖర్చు కాదు. ఇక్కడ నేను ప్రతి ప్లానర్ నుండి కోరుకునే ఒక విషయం ఏమిటంటే, మీరు మీ కుటుంబంలోని వారు మాత్రమే బ్రతకడం కొరకు కాకుండా, మీ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని, మరియు వారి పిల్లల అభివృద్ధిని, మీరు దృష్టిలో ఉంచుకుని మీ శాస్త్రీయ పరిజ్ఞానంతో ఒక మంచి వాస్తుతో ఇంటి ప్లాన్ ఇవ్వగలిగితే, అప్పుడు మీరు మీ వృత్తికి న్యాయం చేసినవారవుతారు.

ఏదైనా అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్ ప్లాన్ మరియు సైట్ సందర్శన కన్సల్టేషన్
ఫీజు: కనిష్టంగా రూ. 50,409/- లేదా గరిష్టంగా రూ. 1,00,809/-

ఏదైనా వ్యక్తిగత ఇల్లు లేదా డ్యూప్లెక్స్ విల్లా ప్లాన్ మరియు సైట్ సందర్శన
సంప్రదింపుల రుసుము: రూ. 20,079/-

గమనిక: 99% కచ్చితమైన వాస్తు ప్రణాళిక కావాలనుకునేవారు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.

CONTACT NOW