సంఖ్య శాస్త్రం
మీ జీవితాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణించడానికి ఉపయోగపడే శాస్త్రం

సంఖ్య శాస్త్రం

సంఖ్యా శాస్త్ర ప్రభావం మానవుల పై ఎంతలా ఉంటుందంటే, ఒక వ్యక్తి తన జన్మ జాతకంలోని గ్రహస్థానాల ప్రభావం వల్ల గొప్ప విజయాలను సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవలసిన వంటి వాడు, తన పేరులోని అక్షరాల సంఖ్యల ప్రభావం తన జన్మ సంఖ్యకు సరిపోని పేరు ఉండటం వల్ల తన ఎదుగుదల మరియు అభివృద్ధిలో క్షీణతను ఎదుర్కోవచ్చు, కొందరి జీవితంలో అయితే పురోగతి పూర్తిగా లోపించవచ్చు. అదే ఒక వ్యక్తికి తన యొక్క జనన తేదీని అనుసరించి జన్మ నక్షత్రమును ఆధారంగా సంఖ్యా శాస్త్రం కూడా అనుసరించి పేరు పెట్టిన యెడల ఆ పేరులోని లెటర్ల సంఖ్యల ఆధారంగా వచ్చేటువంటి వైబ్రేషన్స్ ప్రభావంతో ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా అభివృద్ధి వంతంగా ఉంటుంది.
ఇది ఎంతవరకు నిజమా లేదా అబద్ధమా అన్నది మీకు అర్థం కావడానికి నాకు తెలిసినటువంటి వివరముల ఆధారంగా ఒక చిన్న ఉదాహరణను మీకు ఈ కింద తెలియపరుచుతున్నాను.
మన దేశ ప్రధానమంత్రి గారైనటువంటి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క వివరాలను మనం పరిశీలిద్దాం.
నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, వారి జన్మ తేదీ 17-09-1950 ఇప్పుడు మనం ఈ యొక్క జన్మ తేదీలోని అంకిలన్నిటిని వరస క్రమంలో ఒకదానికి ఒకటి కలిపి కూడినట్లయితే, 32వ రెండు అంకెల సంఖ్య మనకి వస్తుంది. అదేవిధంగా కేవలం జన్మ తేదీని తీసుకుంటే 17డు రెండు అంకెల సంఖ్య రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం పైన తెలిపినటువంటి ఈ రెండు సంఖ్యలను ఏక సంఖ్య గా మార్చడం కొరకు మొదటగా వచ్చినటువంటి 32నీ చేద్దాం 3+2=5వ అంకె రావటం జరిగింది, అలాగే తర్వాత ఉన్న వంటి 17వ సంఖ్యను కూడా అదే క్రమంలో చేస్తే 1+7=8వ సంఖ్య రావడం జరిగింది. అంటే పూర్తి జన్మ సంఖ్యను కూడితే 5వ సంఖ్య. కేవలం జన్మ తేదీని మాత్రమే కూడితే 8వ సంఖ్య రావడం జరిగినది. ఇప్పుడు ఈ సంఖ్యలు వారి పేరుకి సరిపడుతున్నాయా లేవా అన్నది తెలుసుకుందాం. నరేంద్ర అన్న పదమునకు 25వ సంఖ్య, అలానే దామోదర దాస్ అన్న పదానికి 31వ సంఖ్య, చివరిగా మోడీ అన్న పదానికి 16వ సంఖ్య రావడం జరిగినది. ఈ సంఖ్యలన్నిటిని ఒకడిగా కూడగా 72డు రెండు అంకెల సంఖ్య రావటం జరిగింది. దీనిని మరల ఏక సంఖ్యగా కూడితే 7+2=9వ సంఖ్య రావడం జరిగినది. ఇప్పుడు ఈ సంఖ్యకు పై వచ్చిన సంఖ్యలకు సంబంధించినటువంటి గ్రహాల యొక్క సామరస్యం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదట కూడిన దానికి 5వ సంఖ్యకి అధిపతి బుధ గ్రహం, అలాగే తేదీకి సంబంధించిన సంఖ్య 8వ సంఖ్యకి అధిపతి శనిగ్రహం మొదట ఈ రెండు గ్రహాల మధ్య సమైక్యత చాలా బాగుంటుంది. కానీ పేరులోని 9వ సంఖ్యకు అధిపతి అంగారక గ్రహం, ఈ గ్రహానికి పైన తెలిపినటువంటి గ్రహాల మధ్య సమైక్యత భావం సక్రమంగా ఉండదు. కనుక ఇప్పుడు మనం సమైక్యత కొరకు సంఖ్యలను అనుసంధానం చేయాల్సి వస్తే అది కేవలం పేరులో మాత్రమే కుదురుతుంది, కనుక పేరులోని మొదటి పదాన్ని తీసుకుంటే 25వ రెండు అంకెల సంఖ్యను ఒకటిగా కూడినట్లయితే2+5= 7వ సంఖ్య రావటం జరుగుతుంది.
అదేవిధంగా చివరి పదం యొక్క సంఖ్య16నీ కూడా కూడినట్లయితే1+6=7వ సంఖ్య రావడం జరిగినది. మరల ఈ రెండిటిని కూడినట్లయితే 7+7=14వ సంఖ్య రావటం జరిగింది. దీనిని మనకు కావాల్సినటువంటి ఏక సంఖ్య రావడం కొరకు కూడినట్లయితే 1+4=5వ సంఖ్య రావడం జరిగినది అనగా ఈ సంఖ్యకి అధిపతి కూడా బుధుడే కావడం, అలానే జన్మ జాతకంలోని పూర్తి సంఖ్యలకు అధిపతి కూడా బుధుడే కావటం విశేషం, దీనికి మిత్రగ్రహమైనటువంటి జన్మ తేదీ 8వ సంఖ్య గ్రహాధిపతి అయినటువంటి శనిగ్రహం కూడా మిత్రగ్రహం కావడం వలన ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా పురోగతిని సూచిస్తుంది.
కనుక ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు పేర్లను పెట్టేటప్పుడు జన్మ నక్షత్రానికి అనుగుణంగా సంఖ్య శాస్త్ర ఆధారితంగా కనుక పేర్లను పెట్టినట్లయితే వారికి కూడా తప్పకుండా మంచి జీవితంతో కూడిన భవిష్యత్తు ఉంటుంది, ఇక్కడ పుట్టిన వారికే మాత్రమే కాదు పూర్తి వివరాలు తెలిసినవారు తమ యొక్క పేరులోని తప్పులను సరి చేసుకొని అనగా మార్చుకుని ఆ మార్చిన యొక్క పేరుని శాశ్వతంగా అనుసరించినట్లయితే వారికి కూడా అభివృద్ధి తప్పకుండా చేకూరుతుంది.

సంప్రదింపుల రుసుము : Rs.2079/-


CONTACT NOW