చేతన్ కేరళ జ్యోతిష్య వాస్తు యంత్రాలయం అధిపతి శ్రీ కేశవన్ తంత్రి గురూజీ యొక్క ముత్తాత దివంగత శ్రీ శ్రీకర్పణి ఒక ప్రఖ్యాత జ్యోతిష్యుడు. ఆయన 120 సంవత్సరాల క్రితం తన తాతగారి నుండి
ఈ విద్యలో శిక్షణ పొందారు. మరియు మంత్ర, యంత్ర, తంత్ర విద్యతో పాటు అష్టమంగళ ప్రశ్న జాతక పద్ధతిని ఉపయోగించి ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను అందించారు.
ఈ యొక్క జ్ఞాన సంపద అనేది వారి వంశంలో తరానికి ఒకరు చొప్పున వస్తూ కొనసాగింది, ఆ విధంగా వచ్చిన వారిలో ఒకరే కేశవన్ తంత్రి గురూజీ.
కేశవన్ తంత్రి గురూజీ నేటికీ ఈ విద్యను ఆచరిస్తూ వివిధ రంగాలలో ఉన్న తన క్లయింట్లు ఎదుర్కొంటున్న సమస్యలను విజయవంతంగా అంచనా వేసి పరిష్కరిస్తున్నారు.
కేశవన్ తంత్రి గురూజీ తాతగారు దివంగత శ్రీ శ్రీ వేలాయుధన్ గారు మరియు ఆయన భార్య దివంగత శ్రీమతి జానకి వేలాయుధన్ అమ్మవన్ తమ చివరి శ్వాస వరకు కేరళ రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఈ సేవలను అందిస్తూ వచ్చారు.
ఒకానొక సందర్భంలో చాలాకాలం అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణ అపాయ స్థితిలో ఉన్న తన బావ గారిని మరియు అతని చెల్లెలు మరియు పిల్లలను తీసుకొని ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక వ్యక్తి కుటుంబ సమేతంగా
శ్రీ శ్రీ వేళాయెదను గారి వద్దకు వచ్చి, తమ బావను రక్షించవలసిందిగా వేడుకొన్నారు. కానీ వారు వచ్చేసరికే వారికి జరిగిన చెడు ప్రయోగం ప్రభావం యొక్క కాలం ఏకువ అవడం వలన, సమస్య తీవ్రత ఎక్కువ అయ్యి అతన్ని
రక్షించేటువంటి అవకాశం శ్రీ వేలాయుధన్ గారికి లేకుండా పోయింది. అందరూ చూస్తుండగానే చెడు ప్రయోగం వల్ల అనారోగ్యంతో బాధపడుతునటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. కళ్ళముందు చనిపోయిన వ్యక్తిని చూసి గుండెలు బద్దలయ్యేలా ఏడ్చి బాధపడుతున్నటువంటి అతని భార్య బిడ్డలను
చూసినటువంటి శ్రీమతి జానకి వేలాయుధన్ గారికి మనసు చాలా బాధతో కృంగిపోయింది. ఆ చనిపోయిన వ్యక్తిని కొంతకాలం ముందే శ్రీ వేలాయుధన్ గారి వద్దకు తీసుకొచ్చి ఉండుంటే తప్పకుండా అతని సమస్యను తీర్చి అతని ప్రాణాలు కాపాడేవారు.
లేక ఈ విద్య తెలిసినటువంటి వైద్యులు వారికి అందుబాటులోఉన్న, అతను బతికి ఉండేవాడు కదా ఇలా అందుబాటులో అనుభవజ్ఞులైన వైద్యం తెలిసినవారు లేక అనేకమందికి ఈ దుస్థితి పడుతుంది అని దేశవ్యాప్తంగా అవసరంలో ఉన్న ప్రజలందరికీ నిజమైన ఈ విద్య తెలిసినటువంటి
వారిని ప్రజలందరికీ అందించాలనేది శ్రీమతి జానకి వేలాయుధన్ అమ్మవన్ గారి మదిలో వెలిసిన కోరిక. తన మనసులోని కోరికను ఆలస్యం చేయకుండా వెంటనే శ్రీ వేళాయితను గారికి తెలియపరచి వారి అనుమతితో మొదటి ప్రయత్నంగానే తమ వద్ద ఈ విద్యను నేర్చుకొని అనుభవాన్ని పొందినటువంటి
తన రెండో కుమారుడు అయినటువంటి దివంగత శ్రీ అభిమన్యున్ గారిని ఆంధ్రప్రదేశ్ వైపుకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించింది. తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు దివంగత శ్రీ అభిమన్యున్ గారు 22/02/1959న ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి స్థిరపడి, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మందికి సేవలు అందించార,
తన తండ్రి గారు నిర్వ హించినటువంటి సేవలను శ్రీ కేశవంతంత్రి గురూజీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు.
కేశవన్ తంత్రి గురూజీ గొప్ప జ్యోతిష్యుల కుటుంబం నుండి వచ్చారు. మరియు తరతరాలుగా సంక్రమించిన ప్రత్యేకమైన శిక్షణను పొందారు. ఆయన అష్టమంగళ ప్రశ్న జాతకం ద్వారా చేతబడి మరియు అప మృత్యు దోషం వంటి దోషాలను గుర్తించడంలో కూడా నిపుణులు. కేశవన్ తంత్రి గురూజీ అటువంటి దోషాలు మరియు ముప్పులను తొలగించడానికి తగిన పరిహారాలను సూచిస్తారు. తన ఉత్తమ సలహాలు మరియు కచ్చితమైన అంచనాలను దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో కేశవన్ తంత్రి గురూజీ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
CONTACT NOW