వృశ్చిక రాశి ఫలాల 2026

వృశ్చిక రాశిఫలం 2026
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఏమాత్రం బాగాలేదు. శని గ్రహ, రాహు గ్రహ, మరియు గురు గ్రహ, ప్రభావాల వల్ల మీకు కడుపు సంబంధించిన వ్యాధులు, గుండె, ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచే అవకాశాలు ఉన్నాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహ సంచారం వల్ల కొంతమేర బాగుంటుంది అదే గురుగ్రహం అక్టోబర్ 31 తర్వాత నుండి మరలా స్థానం మారటం వలన ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అంటే ఈ సంవత్సరం ఐదు నెలలు బాగుంటే ఐదు నెలలు బాగోదు తక్కిన రెండు నెలలు యావరేజ్ గా ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు మీ ఆహారపు అలవాట్లు పట్ల శ్రద్ధ వహించాఃడి సరియైన జీవనశైలని అవలంబించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి

వృశ్చిక రాశిఫలం 2026: విద్య
వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్య స్థితిగతులు సక్రమంగా ఉండకపోవటం కారణం చేత మీయొక్క విద్యలో కూడా వాటి ఫలితాలను మీపై ఉంటుంది. అలాగే మీకు సహాయ సహకారాలు అందించే స్నేహితులు మరియు స్నేహితులకు కూడా మీకు సహకరించకపోఛు. కానీ మీకు ఎవరి సహాయ సహకారాలు అందిన అందకపోయినా మీరు మీ చదువులపై పూర్తి శ్రద్ధ సానుకూల వాతావరణం లో చదువులపై దృష్టి సారించినట్లయితే గురు గ్రహ, అనుగ్రహంతో విజయం సాధించగలుగుతారు.

వృశ్చిక రాశిఫలం 2026: వ్యాపారం
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలించకపోయినప్పటికీ, గురు గ్రహ ప్రభావం చేత కొంతవరకు మోస్తరుగా ఉంటుంది. కనుక నూతన పెట్టుబడులు మరియు నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకున్న వాటిలో పూర్తి అనుభవజ్ఞులైన, వృద్ధులు మరియు జ్ఞానవంతులైన వ్యక్తుల మార్గదర్శకత్వంలో ముందుకు వెళితే కొంతవరకు విజయాన్ని సాధించగలుగుతారు.

వృశ్చిక రాశిఫలం 2026: కెరీర్
వృశ్చిక రాశి వారికి కెరియర్ పరంగా ఈ సంవత్సరం ఏమాత్రం అంతగా అనుకూలంగా లేదు. కనుక మీరు పని చేసినటువంటి కార్యాలయం నందు అనవసరంగా మాట్లాడుతూ సమయం వృధా చేసే మిత్రులకు దూరంగా ఉండండి. అలాగే మీ ఇంటికి సంబంధించిన సమస్యలను ఇంటికే పరిమితం చేసుకోండి. మీ యొక్క కార్యాలయాల్లో మిమ్మలను ఇబ్బందులు గురి చేసే వ్యక్తులకు కూడా దూరంగా ఉండండి. ఎక్కువ శాతం మీరు చేయవలసిన పని మీదే శ్రద్ధ పెట్టండి, లేనిపక్షంలో మీయొక్క ఉన్నతాధికారులు వద్ద మీరు చులకన కావడం, కానీ లేదా మీ పట్ల వారికి అసంతృప్తి కలగడం కానీ జరుగుతుంది. తద్వారా వృత్తిలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తలను తీసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫలితాలను భగవంతుడికి వదిలేయండి.

వృశ్చిక రాశిఫలం 2026: ఆర్థికం
వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరంగా చూస్తే సగటుగా ఉండవచ్చు, ఏందువలనంటే ఆర్థిక స్థితికి కారణం మనం చేసే వృత్తి ఉద్యోగాలు, వాటితోనే మనకు ధనం సమకూర్తుంది, కానీ ప్రస్తుత గ్రహ స్థితి వల్ల వాటిల్లో పురోగతి ఏమి అంతగా లేదు, అందువల్ల ఈ సంవత్సరం ఆర్థిపరంగా కొంత మోస్తారుగా ఉంటుంది, కనుక అనవసరపు ఖర్చులతో ధనాన్ని వేస్ట్ చేయకుండా భద్రపరచుకోండి. గురు గ్రహ, ప్రభావం వల్ల మధ్య మధ్యలో కొంత ధనం మీకు సమకూరుతుంది, భద్రపరచుకోండి.

వృశ్చిక రాశిఫలం 2026: కుటుంబ జీవితం వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం కుటుంబ జీవన విధానం అంతా అనుకూలంగా ఉండదు. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న ఘర్షణలు వివాదాలకు దారితీస్తాయి. అటువంటి సమయం లో మీరు హుందాగా ప్రవర్తిస్తూ, మీ యొక్క వాక్చాతుర్యం తో వాటిని ఆపగలిగితే కుటుంబ జీవనాన్ని సామరస్యంగా గడపవచ్చును.

పరిహారాలు : ప్రతి శనివారం ఉదయం మీరు అల్పాహారం తీసుకుంటానికి ముందే ఆవుకి నల్ల నువ్వులు మినుములు పిండి మరియు బెల్లం అరటిపండు కలిపి పెట్టండి. తర్వాత వృద్ధులకు ఎవరికైనా భోజనం పెట్టండి.

ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు. ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి, మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.

CONTACT NOW