ధనుస్సు రాశి ఫలాల 2026

ధనుస్సు రాశిఫలం 2026: ఆరోగ్యం
ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా పెద్దగా ఆరోగ్య సమస్యల ఏమి ఉండవు. శని గ్రహం ప్రభావం వల్ల అలసట, ఒత్తిడి, మానసిక సమస్యలు రావడం మరియు ఉదర సమస్యలు, మోకాలు పిక్కల నొప్పులు రావడం జరుగుతుంది. కనుక మీరు చేసేటటువంటి పనులలో అధికమైన ఒత్తిడిని కలిగిచ్చేటువంటి వాటికి దూరంగా ఉండండి. ఆహార భద్రతలు పాటించండి.

ధనుస్సు రాశిఫలం 2026: విద్య
ధనస్సు రాశి విద్యార్థులకు కృషికి అనుగుణంగా విద్యారంగంలో ప్రతిఫలం ఉంటుంది. అయితే కొన్ని బలహీన దశలు ఉండవచ్చు అందువల్ల చదువులు పరంగా బలహీనంగా అవటం జరుగుతుంది. అయితే జూన్ 2వ తారీకులోపు గురు గృహ, ప్రభాతం చేత మీ కృషి ఎంత చేస్తే మీకు మీరు ప్రయత్నిస్తున్న విద్యారంగంలో అంత ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గృహ యొక్క అనుగ్రహం తగ్గటం వల్ల కొంతవరకు మరల విద్య వ్పట్ల పురోగతి తగ్గుతుంది.

ధనుస్సు రాశిఫలం 2026: వ్యాపారం
ధనుస్సు రాశి వారికి వ్యాపార పరంగా ఈ సంవత్సరం శని గృహ, దశమ దృష్టి ప్రభావం మీ యొక్క జన్మ రాశి పైన ఉన్నప్పటికీ గురు గృహ, యొక్క సప్తమ విక్షణ వల్ల మీరు చెయ్యు వ్యాపార రంగాలలో విజయాలను సాధిస్తారు. అయితే ఈ సంవత్సరం జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహం మీ యొక్క అష్టమ స్థానంలోనికి ప్రవేశించడం వల్ల, మీ యొక్క వ్యాపారాలలో కొన్ని నష్టాలతో కూడిన సందర్భాలు కూడా రావచ్చును. కనుక వ్యాపార వ్యవహార విషయాలలో సమయస్పృతితో ఉండటం వల్ల, వ్యాపార రంగాలలో అభివృద్ధిలో ఉండగలుగుతారు.

ధనుస్సు రాశిఫలం 2026: కెరీర్
ధనుస్సురాశి జాతకులకు కెరియర్ పరంగా ఈ సంవత్సరం శుక్ర గ్రహ, అనుగ్రహం వల్ల ఉద్యోగాలలో సానుకూల ఫలితాలకు అవకాశాలు ఉన్నాయి. కానీ శని గ్రహ, కేతు గ్రహాల, ప్రభావం వలన వ్యతిరేక ఫలితాలు కూడా వచే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. లేదా ఉద్యోగాలు మారను వచ్చు, కానీ రిస్కు తీసుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి. మీరు ఏ ఇతర విషయాలపై ప్రభావం చూపు కుండా వృత్తిలో కృషి చేసినట్లయితే, తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి లభించి ఉన్నత స్థానాల్లో గౌరవంతో కూడిన మర్యాదను పొందగలుగుతారు.

ధనుస్సు రాశిఫలం 2026: ఆర్థికం
ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి పెద్ద ఆర్థిక ఇబ్బందులు ఉండవు. జనవరి నుండి జూన్ 2 వరకు గురు గ్రహం, ఏడవ ఇంట్లో ఉంటాడు, ఇది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో సహాయపడుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహం, ఎనిమిదవ ఇంట్లోకి ఉచ్ఛ స్థితిలోకి వెళతాడు మరియు అక్కడి నుండి, అది మీ సంపద ఇంటి వైపు దృష్టి పెడుతుంది, ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. శని ప్రభావం సగటుగానే ఉంటుంది, ఇతర గ్రహాలు మీకు మంచి ఫలితాలను ఈచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశిఫలం 2026: కుటుంబ జీవితం
ధనుస్సు రాశి వారికి కుటుంబ జీవితంలో ఈ సంవత్సరం ఎక్కువ భాగం సమస్యలు ఉండవచ్చు. ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. మీరు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, అవి తరువాత పెద్దవిగా పెరిగీ వివాదాలు తలెత్తవచ్చు. మీకు భూమి, ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. ధనుస్సు రాశి వారు కుటుంబంలో శాంతిని కాపాడుకోవాలి.

ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు. ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి, మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.

CONTACT NOW