తులా రాశిఫలం 2026: ఆరోగ్యం
తులా రాశి వారికి ఈ సంవత్సరం అంతంత మాత్రం గానే ఉంటుంది. శని గ్రహ ప్రభావం వల్ల మీకు తలకి లేక బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు, నడుముకి సంబంధించిన సమస్యలు,
జ్ఞానేంద్రియాల సంబంధించిన సమస్యలు, మరియు మోకాలు పిక్కలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి కనుక ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తో నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధతో ఉండండి.
తులా రాశిఫలం 2026: విద్య
తులా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం రాహు గ్రహ ప్రభావం వల్ల వారు ఎంత చదువుకున్నా కూడా అవి గుర్తుండకపోవడం, అందువల్ల చదువు పట్ల అశ్రద్ధ ఎక్కువ అవ్వటం జరుగుతుంది.
కానీ బృహస్పతి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉండటం వల్ల కష్టపడి శ్రద్ధతో చదివిన వారికి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కనుక విద్యార్థులు అశ్రద్ధని మానుకొని, శ్రమతో కూడిన శ్రద్ధతో చదువుపైద్యాస ఉంచవలెను.
తులా రాశిఫలం 2026: వ్యాపారం
తులా రాశి వారు ఈ సంవత్సరం వ్యాపారపరంగా రాహు గ్రహ, కుజ గ్రహ, ప్రభావం చేత కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మీరు ఏ విధమైనటువంటి బంధుమిత్రులతో కానీ, ఇతరులతో కానీ,
పార్ట్నర్షిప్పుల తో కూడినటువంటి వ్యాపారా లావాదేవీలను చేయకండి. మీరు మీ తెలివితేటలను కష్టాన్ని అధికంగా పెట్టి, అనగా అధిక శ్రమతో వ్యాపారాన్ని కొనసాగించినట్ల అయితే,
ఇతర గ్రహాల అనుగ్రహం వలన మీ శ్రమకు తగిన మంచి ఫలితాలను పొందవచ్చు.
తులా రాశిఫలం 2026: కెరీర్
తులా రాశి వారికి కెరియర్ పరంగా ఈ సంవత్సరం శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల, మీరు పని చేస్తున్నటువంటి కార్యాలయాల్లో బాగా కష్టపడి అంకితభావంతో పనిచేస్తే,
గురు గ్రహ, అనుగ్రహం వల్ల మీరు మంచి విజయాలు సాధించగలరు. అలాగే మీ సహోద్యోగుల దృష్టిలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది.
మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు రాబోయే కాలంలో మీరు పనిచేసిన విధానాన్ని ఇతరులకు ఉదాహరణగా చూపిస్తారు.
అలాగే మీకు ఉద్యోగంలో స్థానచలనం, తద్వారా కూడిన ప్రమోషన్లు రావడం, మీరు పనిచేసే కార్యాలయంలో ఉన్నత స్థితిలో గౌరవప్రదంగా
ఉండటం జరుగుతుంది. కనుక ఈగో నీ పక్కన పెట్టి నలుగురుతో కలిసి ఉండండి ఉన్నత స్థానాలను అధిరోహించండి.
తులా రాశిఫలం 2026: ఆర్థికం
తులారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా బాగుంటుంది. గురు గ్రహం, కేతు గ్రహాల, ప్రభావం చాలా అనుకూలంగా ఉంది.
అందువలన ఈ సంవత్సరం మీరు డబ్బుకు సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంటుంది. గురు గ్రహ స్థాన చలనం వల్ల మధ్యలో కొంత ఇబ్బంది కలిగిన మరల చివరికి వచ్చేసరికి మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
తులా రాశిఫలం 2026: కుటుంబ జీవితం
తులా రాశి వారికి కుటుంబ జీవితా విషయానికి వస్తే, ఈ సంవత్సరం రాహు గ్రహ, కుజ గ్రహ, సంచారం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ, గురు గ్రహ,
ప్రభావం మిగిలిన గ్రహ ప్రభావాలు వలన మీరు కుటుంబ జీవితంలో బలమైన సంబంధం కొనసాగిస్తారు. మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు జరుగవచ్చును,
మరియు ఇంతకుముందు విభేదాలు వలన మీతో దూరంగా ఉన్నా బంధువులు లేక మిత్రులు కూడా ఈ సమయంలో మీకు దగ్గరయ్యి,
మీయొక్క మంచి చెడుల విషయంలో వారి సహాయ సహకారాలు అందిస్తుంటారు. కనుక ఈ సంవత్సరం కుటుంబ జీవితం బాగానే ఉంటుందని చెప్పవచ్చు.
పరిహారాలు : మీరు ఈ సంవత్సరం సాయిబాబా గుడి వద్ద ఉన్నటువంటి మూగజీవాలకు కడుపునిండా ఆహారాన్ని పెట్టండి. అలాగే మీరు కూడా వీలైనంతవరకు సాత్విక ఆహారాన్ని స్వీకరించి, సాత్విక తత్వంతో ఉండండి.
ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు.
ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి,
మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.