సింహ రాశిఫలం 2026: ఆరోగ్యం
సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు, ఎందుకు అంటే శని గ్రహం మీ యొక్క ఎనిమిదవ స్థానంలో ఉండటం తో పాటు రాహు కేతుల ప్రభావం జన్మరాశిపై ఉన్నందున ఈ సంవత్సరం మీకు ఏదో ఒక ఆరోగ్య సమస్య రావటం తో పాటు,
ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నది కనుక ఆహార భద్రతతో పాటు వ్యయమము, యోగ, వంటివి చేస్తూ, ప్రయాణాలలో జాగ్రత్తలను తీసుకుంటూ ఉండండి.
సింహ రాశిఫలం 2026: విద్య
సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు గురుగ్రహం మీ పదకొండవ ఇంట్లో (లాభాల ఇల్లు) ఉన్నందున ఆ సమయం వరకు విద్యలో సానుకూల ఫలితాలను పొందుతారు. లా,
పరిశోధన విద్యార్థులు, ఫైనాన్స్, మరియు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే, జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం మీ పన్నెండవ స్థానమునకు సంచారం చేయుట వలన,
రాహువు, కేతువు మరియు శని గ్రహ స్థానాల ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తి విద్యకు ఆటంకములు కలగవచ్చు, బుధ గ్రహం విద్య విషయంలో ఎక్కువగా మద్దతు ఇస్తున్న, కుజగ్రహ ప్రభావంతో విద్యార్థులకు సకుటుగానే ఉంటుంది.
కనుక అశ్రద్ధను వదిలి అతిగా శ్రద్ధతో చదువుకొనవలెను.
సింహ రాశిఫలం 2026: వ్యాపారం
వ్యాపార పరంగా సింహ రాశి వారికి ఈ సంవత్సరం అంతగా బాగుండదు. ఎందుచేతనంటే, జూన్ 2 వరకు గురు గ్రహం సానుకూల ఫలితాలను ఇస్తుంది, ఈ సమయంలో వ్యాపార పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
జూన్ రెండు నుండి గురు గ్రహం 12 స్థాన సంచార ప్రభావం వలన సానుకూల ప్రభావం తగ్గుముఖం పడటం వలన, మరియు శని గ్రహ, రాహు, కేతు, గ్రహ స్థాన ప్రభావాలు అధికంగా ఉండటం వలన వ్యాపారంలో ఆర్థికంగా నష్టాలను చేకూర్చే విధంగా ఉంటుంది.
కాబట్టి సింహరాశి జాతకులు ఈ సంవత్సరం ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం గాని లేదా కొత్త రకమైన వ్యాపారాలను ప్రారంభించాలన్న ఉద్దేశాన్ని కానీ మానుకొని ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవలెను.
సింహ రాశిఫలం 2026: కెరీర్
సింహరాశి వారికి ఈ సంవత్సరం కెరియర్ పరంగా అనేక రకములైన ఒడిదుడుకులతో కూడుకొని ఉంటుంది కనుక
మీరు వాటిని అధిరోహించడానికి నిరంతరం ఎంతో కృషి ఓర్పు స్థిరత్వంతోను మీ కార్యాలయంలో సామరస్య సంబంధాలను కొనసాగించడం వలన చాలా వరకు ఉత్తమ ఫలితాలను పొందుతారు.
సింహ రాశిఫలం 2026: ఆర్థికం
సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం మొదటి నుండి గురు గ్రహ ప్రభావం వల్ల నైతికంగా కొంతవరకు బాగున్నప్పటికీ జూన్ 2 తర్వాత నుండి గురు గృహం వ్యాయా స్థానంలోకి సంచరించడం, శని అష్టమంలోనూ, రాహువు సప్తమంలోనూ,
కేతువు జన్మమునందు, సంచరించడం చేత మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తుతుంటాయి కనుక ధనమును ఖర్చు చేయు విషయంలో అనవసరపు వాటికి ఖర్చులు చేయకుండా ఉన్న ధనాన్ని పొదుపు చేసిన యెడల అది మీకు కష్ట సమయంలో ఉపయోగపడుతుంది.
సింహ రాశిఫలం 2026: కుటుంబ జీవితం
సింహ రాశి వారికి కుటుంబ జీవితం విషయాల్లో ఈ సంవత్సరం బలహీనంగా ఉందని చెప్పవచ్చు. శనిగ్రహ యొక్క ప్రభావం, మరియు గురువు గ్రహం స్థాన చలనం, మరియు రాహు కేతువుల యొక్క ప్రభావం వలన కుటుంబ సభ్యులో అంతఃకలహములు,
కుటుంబం కు దూరంగా ఉండుట, వంటివి సంభవించును అయితే గురు గ్రహ ప్రభావం చేత కొంతవరకు పెను ప్రమాదాలనుండి కుటుంబ సభ్యులను కాపాడుకునే అవకాశం ఉంటుంది .
పరిహారాలు : ప్రతిరోజు సూర్య నమస్కారములు చేయవలెను, అలానే ప్రతి ఆదివారం మూగ జీవులకు ఆహారము పెట్టవలెను,
ప్రతి శనివారము మినప్పప్పు, నల్ల నువ్వులు, బెల్లం కలిపి ఆవుకి ఉదయం పూట తినిపించవలెను.ఉదయం పూట తినిపించవలెను.
ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు.
ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి,
మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.