మిథున రాశి ఫలాలు 2026

మిథున రాశిఫలం 2026: ఆరోగ్యం
మిథునరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి జన్మరాశిలో జూన్ 2 వరకు ఉండటం వలన మీకు అతిగా ఆకలి అనిపించడం తద్వారా నియంత్రణ లేకుండా మితిమీరిన ఆహారాన్ని తీసుకోవడం వల్లను నీకు గ్యాస్ ట్రబుల్ సమస్య, చెస్ట్ లో నొప్పి, హార్ట్ వధ నొప్పి, ఎడమ చేయి నొప్పి, వంటివి రావడంతో పాటు శని గ్రహం యొక్క ప్రభావం చేత నడుము మరియు జననేంద్రియాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి.

మిథున రాశిఫలం 2026: విద్య
మిధున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటిలో గురుగ్రహం జన్మరాశిలో సంచరించడం వలన అంత మంచి ఫలితాలను ఇవ్వనప్పటికీ జూన్ రెండో తారీకు వరకు ఐదవ స్థానం మరియు తొమ్మిదవ స్థానం పై కోన్ దృష్టి ప్రభావం చేత కొంతమేరకు విద్యలో మెరుగుగా ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహం ధనస్థానంలో ఉండటం వల్ల మీకు అనుకులా పరిస్థితులను కలిగిస్తుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగాలకు ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితాలను పొందవచ్చు. అక్టోబర్ 31 తరువాత గురుగ్రహం మీకు సగటు ఫలితాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, శని గ్రహ మరియు రాహు గ్రహ ప్రభావం వల్ల కొన్ని సార్లు మీరు విద్య కి దూరం ఐఎటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కనుక శ్రద్ధతో చదివి ప్రయత్నిస్తే ఫలితాలను పొందగలరు.

మిథున రాశిఫలం 2026: వ్యాపారం
మిధున రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పదవ స్థానంలో శని గ్రహ సంచారం ఏడాది పొడవునా కొనసాగడం వల్ల నా, గురు గ్రహం మీ యొక్క జన్మరాశిలో ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వ తారీకు వరకు గురు గ్రహం ధనస్థానంలో ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో చక్కని ఫలితాలను లాభాలను పొందగలుగుతారు అక్టోబర్ 31 తర్వాత నుండి గురుగ్రహం ధన స్థానం నుండి మారడం వలన కొంత బలహీనమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది కనుక వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు సమయ భావాన్ని గ్రహించి పెట్టుకొన వలెను.

మిథున రాశిఫలం 2026: కెరీర్
మిధున రాశి వారికి కెరీర్ పరంగా సగటు కంటే మెరుగ్గా ఉంటుంది కారణం గురు గ్రహం జూన్ 2 వరకు జన్మంలో ఉండటం చేత సాధారణ ఫలితాలను ఇస్తాడు అంతేకాకుండా చేసేటటువంటి పనిలో కొన్నిసార్లు అవంతురాలు ఏర్పడటం వల్లన అసం తృప్తికి లోనవుతూ ఉంటారు కనుక మీరు చేయవలసిన పనిని అంకితభావంతో చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ పని విజయవంతం అవుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం ధన స్థానంలో ఉండటం వలన ధన స్థానం నుండి ఆరవ స్థానాం పై దృష్టి చూపడం వలన మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నిటిలోనూ విజయాలను సాధించగలుగుతారు అక్టోబర్ 31 తరువాత నుండి మరల గురుసంచారం మారటం వలన మీ యొక్క స్థితిగతుల్లో ఆవంతరాలు ఏర్పడవచ్చును కుజ గ్రహ ప్రభావం జూన్ 21 నుండి ఆగస్టు 2 వరకు మీరు అనవసరపు ప్రయాణాలు చేయటం జరుగుతుంది

మిథున రాశిఫలం 2026: ఆర్థికం
మిధున రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురు గ్రహం జన్మ రాశిలోనే సంచారం చేయటం వలన పనికిరాని అనవసరపు ఖర్చులు చేస్తూ ధనాన్ని వృధా చేయటం జరుగుతుంది జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహం ధన స్థానంలో ప్రవేశించడం వల్ల సంపద ఇంట్లో ఉన్నత స్థితితో చాలా శుభ్రంగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొంత శ్రమ చేసిన ఎడల అధికమైన ధనాన్ని సంపాదించడం జరుగుతుంది ఆర్థికంగా కూడా మీకు ఎదుగుదల కనబడుతుంది అయితే శని రాహు కేతు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండదు ఆందు వల్ల నూతన వ్యాపారాల్లో కానీ లేక ప్రస్తుత వ్యాపారాలలో కానీ కొత్తగా పెట్టుబడులను మాత్రం చేర్చవద్దు ఉన్న వ్యాపారం పైనే శ్రమ చూపిస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.

మిథున రాశిఫలం 2026: కుటుంబ జీవితం
మిధున రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ జీవితం గతంతో పోలిస్తే మెరుగుగా ఉంటుంది గురు గ్రహం జూన్ రెండవ తారీఖు నుండి ఉచ స్థానంలో కి ప్రవేశించడం వలన అక్టోబర్ 31 మధ్య కాలంలో కుటుంబ సభ్యులందరిలోనూ ఒకరి పట్ల ఒకరికి మంచి అంకిత భావాలు కలిగి ఉండటంతో పాటు కొన్ని శుభకార్యాలను కూడా జరిపించడం జరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురు గ్రహం స్థాన చలన వలన కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది డిసెంబర్ 5 తర్వాత కేతు గ్రహ సంచారం రెండవ స్థానంపై ఉండటం వలన కుటుంబ సభ్యులలో కొన్ని సమస్యలు ఇంట్లో మరియు కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు, కనుక ఈ సంవత్సరం చివరి దశలో కుటుంబ జీవితం గురించి జాగ్రత్తగా ఉండవలెను.

పరిహారం : ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయం ఆవుకి నవధాన్యాల పిండిలో అరటిపండును కలిపి ఆవుకి పెట్టండి. గమనిక : నవధాన్యాల పిండిలో వడ్లు ప్లేస్ లో బియ్యాన్ని వాడండి.

ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు. ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి, మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.

CONTACT NOW