విద్య అనేది ప్రతి మనిషి యొక్క వృత్తి మరియు ఉద్యోగ అభివృద్ధికి ఉపయోగపడే ఒక సాధనం. విద్య ద్వారా, ఒక వ్యక్తి వివేకం తో కూడిన జ్ఞానాన్ని, తెలివితేటలు మంచి చెడులను నేర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో వాటి ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతాడు. అయితే, కర్మ దోషాల కారణంగా కొంతమంది జీవితాలలో గ్రహాల ప్రభావం వల్ల, కొందరు ప్రాథమిక విద్యలోనూ, మరికొందరు ఉన్నత విద్యలోనూ ఆటంకాలను ఎదుర్కొంటారు. అటువంటి విద్యార్థుల జన్మజాతక పత్రాన్ని మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన జ్యోతిష్ణకు చూపించిన యెడల వారు ఆ యొక్క జాతక పత్రాన్ని పరిశీలించి మీరు చేయవలసినటువంటి పరిహారాలను తెలియపరుస్తారు అట్టి పరిహారాలు ను చేస్తే, గ్రహాల యొక్క అనుగ్రహం వలన, విద్యలో ఎదురయ్యే ఆటంకాల నుండి ఉపశమనం పొందవచ్చు.