మకర రాశిఫలం 2026: ఆరోగ్యం
మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురు గ్రహం, మీ యొక్క ఆరో ఇంట్లో ఉంటాడు. ఇది బల హీనమైన వంటి స్థానం అందువలన మీకు ఇప్పటికే కడుపు, లేదా నడుముకి,
సంబందించిన సమస్యలు ఉండవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహం, యొక్క ఉచస్తానం అయినటువంటి ఏడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీకు ఆరోగ్య సంబంధ విషయాలలో కొంతవరకు మెరుగు గానే ఉంటుంది.
అక్టోబర్ 31 తర్వాత గురు గ్రహం, మీ యొక్క అష్టమ స్థానంలోకి మారటం వల్ల ఆరోగ్యం మళ్లీ బలహీనంగా మారుతుంది అలాగే మీకు రాహు గ్రహ, ప్రభావము వలన కూడా మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు, కనుక ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి.
మకర రాశిఫలం 2026:
మకర రాశి విద్యార్థులు ఈ సంవత్సరం జూన్ 2 వరకు విద్యా విషయంలో కొంతవరకు పరధ్యానం లో ఉండటం జరుగుతుంది. దీనివల్ల చదువుల పై కాకుండా ఇతర విషయాలపై ఆలోచనలు మారిపోతాయి ఉంటాయి.
జూన్ 2 నుండి అక్టోబర్ 31 మద్య కాలంలో గురు గ్రహ సప్తమ స్థాన ప్రభావం వల్ల విద్యకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి, ఆ సమయంలో విద్యార్థులు చురుగ్గా చదువుల పట్ల, పోటీ పరీక్షలో బాగా అభివృద్ధిని సాధిస్తారు. నవంబర్ 1 నుండి కొంతకాలం ఆరోగ్య సమస్యలతో విద్యకి ఆటంకం కలగవచ్చు.
మకర రాశిఫలం 2026: వ్యాపారం
మకర రాశి జాతకులు మీరు మీ కృషికి అనుగుణంగా శుభ ఫలితాలను పొందగలుగుతారు. పదవ ఇంటి అధిపతి శుక్రుడు సంవత్సరం మీకు ఎక్కువ సమయం అనుకూలంగా ఉంటాడు. శని స్థానం మీకు సానుకూలంగా ఉంటుంది,
జూన్ 2 వరకు గురు గ్రహ అనుగ్రహం తక్కువగా ఉండటం వల్ల వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం జరుగుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహ అనుగ్రహం వలన మీరు వ్యాపారంలో విజయం సాధించవచ్చు.
మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించవచ్చు లేదంటే వ్యాపారంలో కొత్త భాగస్వామ్యంలోకి ప్రవేశించి కొత్త ప్రణాళికపై పనిచేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. అక్టోబర్ 31 తర్వాత,
మీరు వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. రాహు-కేతువు స్థానం ప్రభావం వల్ల డబ్బుకు సంబంధించిన విషయాలలో సమస్యలు రావచ్చు కనుకనే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా.
మకర రాశిఫలం 2026: కెరీర్
మకర రాశి జాతకులు ఈ సంవత్సరం శని గ్రహ, ప్రభావం వల్ల ఓపికతో కష్టపడి పనిచేసే వారికి, మరియు అనుభవిజ్ఞులైన పెద్దల మాట వినే వారికి ఉద్యోగులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి.
అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురు గ్రహం, ఆరవ స్థానంలో ఉండడం వల్ల కొంత సమస్యలు వచ్చినప్పటికీ, జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహం,
సప్తమ స్థానంలో ఉండటం వల్ల నిర్వహణ రంగం, విద్య మరియు ఆర్థిక రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కోర్టు మరియు న్యాయవాద రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది.
నవంబర్ ప్రారంభం నుండి గురు గ్రహం, వ్యతిరేక ఫలితాలను అందిస్తాడు.
మకర రాశిఫలం 2026: ఆర్థికం
మీ లాభదాయక గృహ అధిపతి మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు సంవత్సర ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురుగ్రహం, ఆరవ ఇంట ఉండటం చేత మీరు ఎక్కువ ఆదాయం చేయలేకపోవచ్చు.
కానీ జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురు గ్రహం, సప్తమ స్థానంలోకి ప్రవేశించి ఉండటం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. రాహు గ్రహ, ప్రభావం వల్ల అనవసరపు ఖర్చులను ఎక్కువగా చేయటం జరుగుతుంది.
కనుక మీరు ఇటువంటి ఖర్చులను తగించుకున్నట్లయితే, ఈ సంవత్సరం ఆర్థికపరంగా బాగానే ఉంటుంది.
మకర రాశిఫలం 2026: కుటుంబ జీవితం
మకర రాశి జాతకులకు కుటుంబ జీవితంలో రాహు గ్రహం, రెండవ ఇంట్లో ఉండటం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లోపించవచ్చు. ఒకరిని ఒకరు అనుమానించకొవచ్చు,
లేదా చిన్న చిన్న విషయాల గురించి గొడవలు కూడా సృష్టించవచ్చు. ఆస్తులకు సంబంధించి కూడా సమస్యలు గొడవలు రావచ్చు. కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు సానుకూలంగా ఆలోచించడం ద్వారా గురు గ్రహ,
ప్రభావం చేత కొంతవరకు సమస్యలు పరిష్కారమై కుటుంబంలో సంతోషంగా ఉండగలుగుతారు.
పరిహారాలు : మీరు క్రమం తప్పకుండా మీ తల్లిదండ్రులను ఆరాధించండి, లేనివారు కనీసం మీ తల్లి గారి వయసుకు సంబంధించినటువంటి వారిని అయినా ఆరాధించండి.
ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు.
ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి,
మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.