మేష రాశి ఫలాలు 2026

మేష రాశిఫలం 2026: ఆరోగ్యం
మేషరాశి వారికి ఈ సంవత్సరం శని గ్రహ సంచారం 12వ స్థానంలోను బృహస్పతి గ్రహ సంచారం 3వ స్థానంలోను ఉండటం వలన గుండె సమస్యలు, పరిస్థితుల సమస్యలు, నిద్ర సంబంధిత సమస్యలు, కాళ్ళకి సంబంధించిన సమస్యలు,మరియు ఈ సంవత్సరం ప్రారంభం నుండి కుజ గ్రహ సంచారం దహన స్థితిలో ఉండటం వలన ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ ఇంకా నవంబర్ నెలల్లో కుజుడు బలహీనంగా ఉంటాడు అందువలన మీ యొక్క రోగనిరోధక శక్తి పై ప్రభావం అధికంగా ఉంటుంది కనుకనే ఆరోగ్య సమస్యల పట్ల అశ్రద్ధను మానుకొని ఈ యొక్క సంవత్సరం అంతయు జాగ్రత్తగా ఉండవలెను.

మేష రాశిఫలం 2026: విద్య
మేష రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యా విధానం పట్ల చాలా శ్రద్ధ జాగ్రత్తలు చాలా అవసరం క్రమశిక్షణతో కూడి శ్రద్ధతో కష్టపడి చదివితేనే ఫలితాలను పొందేందుకు కొంతవరకు అవకాశాలు ఉన్నాయి కనుక అశ్రద్ధను మానుకోండి.

మేష రాశిఫలం 2026: వ్యాపారం
ఈ సంవత్సరం మేషరాశి స్థానికులు తమ వ్యాపారంలో చేసే ప్రయత్నాలకి అనుగుణంగా పూర్తిగా ప్రతిఫలం ఇవ్వకపోవొచ్చు. మీరు కష్టపడి పని చేసినప్పటికీ, మీ వ్యాపార ప్రయత్నాల ఫలితాలు మీ అంచనాలకి అనుగుణంగా ఉండకపోవొచ్చు. కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించవద్దు, అలాగే చేస్తున్న వ్యాపారంలో అధికంగా పెట్టుబడులను కూడా పెట్టకండి.

మేష రాశిఫలం 2026: కెరీర్
ఉద్యోగ పరంగా 2026 సంవత్సరం మేషరాశి వారికి సగటుగా ఉంటుంది. 12వ ఇంట్లో శని గ్రహ సంచారం వలన ఇబ్బందులకు గురి అవుతున్నప్పటికీ , 6 వ ఇంట్లో శని యొక్క కోణం దృష్టి ఉండటం వలన మీరు ఓపికగా మరియు అదనపు కృషి అంకితభావంతో పనిచేస్తే అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు.

మేష రాశిఫలం 2026: ఆర్థికం
మేషరాశి ఫలాలు 2026 ప్రకారం ఆర్థిక జీవితం సగటు గ్గా ఉంటుంది. మీ కెరీర్ మద్యస్థ ఫలితాలను ఇచ్చినప్పటికీ, మీ ఆదాయం మరియు పొదుపులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయి. ఈ సంవత్సరం ఊహించిన ఆర్థిక లాభాలు అసంభవం, ఎందుకంటే ఆ దిశలో మీకు గ్రహాల మద్దతు పెద్దగా లభించనందువలన , వ్యాపారం లేదంటే మీ ఉద్యోగం నుండి లాభం పూర్తిగా మీ కృషి ద్వారా వస్తుంది అలాగే మీ యొక్క పొదుపులు, మీ ప్రయత్నం ద్వారా ఎంత సంపాదిస్తారు అనే దాని పైన ఆధారపడి ఉంటుంది.

మేష రాశిఫలం 2026: కుటుంబ జీవితం
ఈ సంవత్సరం మేషరాశి వారికి కుటుంబ జీవితం పరంగా కొంచెం సవాలుగా అనిపించవొచ్చు, రెండవ ఇంటి అధిపతి శుక్రుని సంచారము అనుకూలంగా ఉన్నప్పటికీ, రెండవ ఇంటి పైన శని యొక్క దృష్టి ఉండటం వలన, మీ యొక్క కుటుంబంలోని వ్యక్తులలో ఎవరైనా మొండిగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క పరిస్థితుల వలన కలవరానికి దారి తీసే సంఘటనలు ఉన్నాయి, కుటుంబ సంబంధిత విషయాలలో కొన్ని ఉద్రిక్తతలను తీసుకురావచ్చు. ఈ సమయంలో మీ మాటలో మధురమైన మరియు మర్యాదపూర్వక స్వరాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అలా చేయడం సరైన సమయంలో విభేదాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. కుటుంబ జీవితం విషయానికొస్తే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు.

పరిహారాలు : మేష రాశి వారు ఈ సంవత్సరం శివ పంచాక్షరి మంత్రాతో పాటు హనుమాన్ చాలీసా నీ గాని సుందరాకాండ నీ గాని పారాయణం చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.

ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు. ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి, మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.

CONTACT NOW