కుంభరాశిఫలం 2026:
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం ఆస్తులు ఏ మాత్రం అనుకూలంగా లేదు కనుక వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, వ్యాపార, కుటుంబ జీవన విధానంలో చాలా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవలెను .
ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి.
విద్యార్థులు ఎంత చదువుదామన్నా వారి యొక్క ధ్యాస వేరే విషయాలు పైకి వెళ్లడంతో చదువుపై శ్రద్ధ పెట్టలేరు. కనుక మీరు చదువులో మంచి స్థానాలకు రావాలి అంటే, తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి.
కెరియర్ పరంగా కూడా అంత గుర్తింపులు లేవు, పైగా చేస్తున్న ఉద్యోగం కూడా లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. కనుక చేసే పనిపై అధికంగా శ్రద్ధ పెట్టండి. ఎవరితోనూ అనవసరంగా ఎక్కువ సేపు పని వదిలి మాటలను కొనసాగించకండి.
వ్యాపార రంగం వారు ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి కొత్త వ్యాపారాలు కానీ లేదా పాత వ్యాపారం పెంచుదామన్న ఆలోచనలు కానీ చేయకండి. ఎందుకంటే మీ వ్యాపారం చాలా మందగుండిగా సాగుతుంది.
ఆర్థిక విషయానికి వస్తే గృహలు అనుకూలంగా లేకపోవడం వలన సంవత్సరం మొత్తంలో రెండు లేక మూడు నెలలు మాత్రమే ఆదాయం కనబడుతోంది. కనుక మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయిని జాగ్రత్తగా అత్యవసర పరిస్థితులకు మాత్రమే ఖర్చు చేయండి.
ఇక కుటుంబ జీవితా విషయానికి వస్తే ఇక్కడ కూడా మీకు కుటుంబంలోని వ్యక్తుల నుండి మీకు సానుకూలత చాలా తక్కువగా ఉంది. మీరు చేయని వాటికి కూడా నిందలు పడటం,
తద్వారా కుటుంబంలో గౌరవ స్థానాన్ని కోల్పోవడం జరుగుతుంది. కనుక ఎంతటి సమస్యలు వచ్చినా కూడా వాటిని మీయొక్క మాట తీరు మరియు వారితో ప్రవర్తించే విధానాలు బట్టి మీకు సానుకూలత దక్కుతుంది తస్మాత్ జాగ్రత్త.
పరిహారం : ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయం ఆవుకి నవధాన్యాల పిండిలో అరటిపండును కలిపి ఆవుకి పెట్టండి. గమనిక : నవధాన్యాల పిండిలో వడ్లు ప్లేస్ లో బియ్యాన్ని వాడండి.
ముఖ్య గమనిక : రాశి ఫలాలు అనేవి ప్రస్తుత గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు, వీటిలో చెప్పబడినటువంటి చెడు సంకేతాలను చూసి ఎవరు కూడా అధైర్య చెందవద్దు.
ఈ ఫలితాలు అందరికీ వందకు వంద శాతం ఆపాదించబడవు. ఎక్కువ శాతం 20% నుండి 25% శాతం వరకు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ యొక్క పూర్తి జాతక చక్రంలోని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి,
మరియు నడుస్తున్నటువంటి దశాబుక్తులను బట్టి మీకు పూర్తి ఫలితాలు ఆపాదించబడతాయి.
.